టాలీవుడ్ నటుడు నాగశౌర్య అనూష శెట్టిని వివాహం చేసుకున్నాడు.

బెంగళూరులో వీరి వివాహ వేడుక అట్టహాసంగా జరిగింది.

ఇరు కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు.

పురోహితుల వేదమంత్రాలు, కుటుంబ సభ్యుల ఆశీర్వాదాల నడుమ కన్నుల పండువగా పెళ్లి జరిగింది.

పెళ్లికి ముందు ‘హల్దీ‘ వేడుక ఘనంగా జరిగింది.

నూతన వధూవరులకు బంధువులు మంగళ స్నానం చేయించారు.

అనంతరం ఒకరికొకరు రింగులు మార్చుకున్నారు.

Photos Credit: Instagram/twitter