కీర్తి సురేష్ పూర్వికుల ఇంటిని చూశారా, ఇల్లు చిన్నదే - కానీ, మనసులు పెద్దవి!

హీరోయిన్స్ అంటే చాలా టెంపర్‌తో ఉంటారని మనం అనుకుంటాం.

కానీ, కీర్తి సురేష్ అలా కాదు. మన ఇంటి పిల్లలా చాలా చక్కగా ఉంటుంది.

ఎంత ఎత్తుకు ఎదిగినా తన సాంప్రదాయాలను ఏ రోజు మరవలేదు కీర్తి.

తాజాగా కీర్తి తమిళనాడులోని తిరుకురున్‌గుడిలోని తన పూర్వికుల ఇంటికి వెళ్లింది.

సుమారు 8వ శతాబ్దం నాటి ఆలయం, పూర్వికుల ఇంటిని సందర్శించింది.

ఆ ఇంటిని చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. మీకూ మీ తాతలనాటి ఇళ్లు గుర్తుకొస్తాయి.

చిన్న సందులో చాలా తక్కువ విస్తీర్ణంలో కీర్తి పూర్వికుల ఇల్లు ఉంది.

కీర్తి ఆ ఇల్లంతా కలియతిరిగింది. అక్కడే కాసేపు కూర్చొని సేదతీరింది.

ఆ వీడియోలు, ఫొటోలు చూసిన అభిమానులు కీర్తి తన మూలాలను మరిచిపోలేదని అంటున్నారు.

Images and Videos Credit: Keerthy Suresh/Instagram