రాజమండ్రిలో తెలుగుదేశం, జనసేన పార్టీల సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది.



నారా లోకేశ్, పవన్ కల్యాణ్ అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో, రెండు పార్టీల నుంచి 14 మంది సభ్యులు హాజరయ్యారు.



అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, పితాని టీడీపీ నుంచి హాజరయ్యారు.



జనసేన తరపున నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మహేందర్ రెడ్డి, పాలవలస యశస్విని హాజరయ్యారు.



వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా రాజమండ్రిలో ఇరు పార్టీల నేతలు సమావేశం అయ్యారు.



ఏపీలో తాజా రాజకీయ పరిణామాలు, పార్టీల సమన్వయంపై చర్చించినట్లు తెలుస్తోంది.



కరవు, కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్షతో పాటు వివిధ ప్రజా సమస్యలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.



నిత్యావసర ధరలు, విద్యుత్‌ ఛార్జీల పెంపు వంటి అంశాలపైనా దృష్టి సారించినట్లు సమాచారం.



వైసీపీ నియంతృత్వ విధానాలను ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ.