ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల అయిన ‘పఠాన్’ బాలీవుడ్‌లో రికార్డు కలెక్షన్లను సాధించింది.

ఏకంగా రూ.524 కోట్ల నెట్ వసూళ్లను సాధించి ఆల్‌టైం రికార్డుగా నిలిచింది.

మళ్లీ ఈ రికార్డును కొట్టడం ‘జవాన్’ లేదా ‘డుంకీ’లకే సాధ్యమని అందరూ భావించారు.

కానీ ‘గదర్ 2’ ఊహించని విధంగా రేసులోకి వచ్చింది.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం ‘పఠాన్’ రికార్డులు బద్దలయ్యే రోజు దగ్గర్లోనే ఉంది.

మొదటి వారంలో షారుక్ ఖాన్ ‘పఠాన్’ రూ.328 కోట్ల వసూళ్లను సాధించింది.

‘గదర్ 2’ మొదటి వారంలో రూ.284 కోట్లతో ‘పఠాన్’కు దూరంగా నిలిచింది.

కానీ సెకండ్ వీకెండ్‌లో ‘గదర్ 2’ జూలు విదిల్చింది.

మొదటి 10 రోజుల్లో పఠాన్ రూ.374 కోట్లు సాధించగా, ‘గదర్ 2’ రూ.375 కోట్లు సాధించింది.

సెకండ్ వీకెండ్ స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి మరికొన్ని రోజుల్లోనే ‘గదర్ 2’ పఠాన్‌ను దాటే అవకాశం ఉంది.