‘గదర్ 2’ సినిమాపై రెండో వీకెండ్‌లో కూడా వసూళ్ల వర్షం కురిసింది. సెకండ్ వీకెండ్‌లో ‘గదర్ 2’ రూ.90 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇది బాలీవుడ్ చరిత్రలోనే రికార్డు. దీంతో మొత్తం వసూళ్లు రూ.375 కోట్ల మార్కును దాటాయి. ఇంకో రెండు రోజుల్లో రూ.400 కోట్లు కూడా దాటే అవకాశం ఉంది. 10వ రోజు అయిన ఆదివారం కూడా రూ.38.9 కోట్ల వసూళ్లను ‘గదర్ 2’ సాధించింది. మొదటి వారంలో ‘గదర్ 2’ రూ.284.63 కోట్లను సాధించింది. సెకండ్ వీకెండ్‌లో వసూళ్లతో ఇది రూ.375 కోట్ల మార్కు దాటింది. ఫుల్ రన్‌లో ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందో చూడాలి.