దక్షిణాఫ్రికాతో పాకిస్తాన్ పరాజయంపై ఆ జట్టు మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కామెంట్లు చేశారు. ముఖ్యంగా పాక్ స్పిన్నర్ మహ్మద్ నవాజ్‌పై విమర్శలు కురిపించారు. మ్యాచ్ కీలకమైన సందర్భంలో పేలవమైన బంతులు వేశాడని విరుచుకుపడ్డారు. ఇఫ్తికర్ అహ్మద్ వంటి పార్ట్ టైం బౌలర్ అయినా బెటర్‌గా బౌలింగ్ వేస్తాడని అభిప్రాయపడ్డాడు. 2023 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌ను ఒక్క వికెట్ తేడాతో చేజార్చుకుంది. ప్రపంచ కప్ చరిత్రలో పాక్ వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఈ ఓటమితో 2023 ప్రపంచ కప్‌లో పాక్ సెమీస్ దారులు దాదాపు మూసుకుపోయినట్లే.