2023 ప్రపంచకప్‌లో సెమీస్ పోరు ఆసక్తికరంగా సాగుతోంది. అన్ని జట్లూ టోర్నీలో ముందుకెళ్లడానికి ఎఫర్ట్స్ పెడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా జట్టు నంబర్‌వన్ స్థానంలో ఉంది. భారత జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు శిఖర్ ధావన్ దీనిపై కామెంట్ చేశారు. భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లకు సెమీస్ అవకాశాలు బలంగా ఉన్నాయన్నారు. నెట్ రన్‌రేట్ ఎంత ముఖ్యం అనేది కూడా తెలిపారు. నెట్ రన్‌రేట్ ఆధారంగా సెమీస్ స్థానాలు తారుమారయ్యే అవకాశం కూడా ఉందని చెప్పారు. ప్రతి ప్రపంచ కప్ మ్యాచ్ ద్వారా పాయింట్ల పట్టికలో భారీ మార్పులు జరుగుతున్నాయన్నారు.