గూగుల్ 2022 గ్లోబల్ డేటా ప్రకారం 'పనీర్ పసంద్' రెసిపీ ఎలా చేసుకోవాలనే దాని గురించి శోధించారు.

ఎంతో నోరూరించే ఈ కర్రీని బటర్ నాన్ తో తింటారు. ఈ డిష్ లో ప్రధాన పదార్థం పనీర్. శాఖాహారులకి ఎంతో ఇష్టమైన ఫుడ్.

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం పనీర్ పసంద్ లో 294 కేలరీలు ఉంటాయి.

పనీర్ లో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. స్త్రీలల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్ ని ఎదుర్కొంటుంది.

పనీర్ తినడం వల్ల పొట్ట ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థని బలోపేతం చేస్తుంది.

కాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల దంతాలు, ఎముకలు బలంగా మారతాయి.

పనీర్ అదనపు కేలరీలని బర్న్ చేయడంలో సహాయపడే కొవ్వు ఆమ్లాన్ని కలిగి ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

పనీర్ లోని మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పనీర్ లో భాస్వరం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. జీర్ణక్రియ సాఫీగా సాగేందుకు సహాయపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Images Credit: Pexels/ Piabay/ Unsplash