హనుమాన్ పంచముఖాల్లో ఏ ముఖం దేనికి సంకేతం



పంచముఖ ఆంజనేయుడు అంటే ఐదు ముఖాలు కలిగినవాడు అని అర్థం



1. తూర్పుముఖంగా హనుమంతుడు: పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగ చేస్తాడు



2. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహ స్వామి: శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తాడు



3. పడమర ముఖంగా మహావీరగరుడ స్వామి: దుష్ట ప్రభావాలను పోగొట్టి, శరీరానికి కలిగే విష ప్రభావలనుంచి రక్షిస్తాడు.



4. ఉత్తరముఖముగా లక్ష్మీవరాహమూర్తి: గ్రహ చెడు ప్రభావాలను తగ్గించి, అష్టైశ్వర్యాలు కలుగజేస్తాడు



5. ఊర్ధ్వంగా ఉండే హయగ్రీవస్వామి: జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవిత భాగస్వామిని-పిల్లల్ని ప్రసాదిస్తాడు జీవనసహచరిని



శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రం



”వందే ,వానర ,నారసింహ ఖగ రాట్ , ,క్రోడాశ్వ ,వాక్త్రాన్చితం
నానాలంకరణం ,త్రి పంచ నయనం ,దేదీప్య మానం రుచా
హస్థాబ్జైహ్ అసి ,ఖేట ,పుస్తక ,సుధా కుంభాం ,కుశాద్రీన్ ,హలం
ఖట్వంగం ,మణి ,భూరుహం, చ దధతం సర్వారి గర్వా పహం ”.



వానర ,నారసింహ ,గరుడ ,సూకర (వరాహం ),అశ్వ అనే అయిదు ముఖాలతో ,అనేక అలంకారాలతో ,దివ్య కాంతితో , దేదీప్యమానమైన 15 నేత్రాలు ,పద్మాలవంటి హస్తాలు....



ఖడ్గం ,డాలు ,పుస్తకం ,అమృత , కలశం , అంకుశం , పర్వతం , నాగలి ,మంచంకోడు (ఖత్వాంగం ),మణులు ,ధరించిన వాడు ,సర్ప శత్రువు అయిన గరుత్మంతుని గర్వాన్ని హరించిన వాడు అయిన హనుమంతునికి నమస్కారం .



Images Credit: Pinterest