వన్‌ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ నేడు చైనాలో లాంచ్ కానుంది.

వన్‌ప్లస్ 11 5జీకి ఇది తర్వాతి వెర్షన్‌గా మార్కెట్లోకి రానుంది.

దీనికి సంబంధించిన లైవ్ ఇమేజెస్ షేర్ అయ్యాయి.

కీలక స్పెసిఫికేషన్లు కూడా రివీల్ అయ్యాయి.

ఇందులో 5400 ఎంఏహెచ్ బ్యాటరీ అందుబాటులో ఉంది.

100W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

కేవలం 26 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా ఛార్జింగ్ ఎక్కనుంది.

ఫోన్ వెనకవైపు 50 + 48 + 64 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండనున్నాయి.