డయాబెటిస్ ఉన్న ప్రతి నలుగురిలో ఒకరికి ఈ సమస్య



మనదేశంలో కూడా ప్రతి ఏటా డయాబెటిక్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఒక వ్యక్తి రక్తంలో చక్కెర అధికంగా ఉండడమే డయాబెటిస్.



రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలి. అధికంగా ఉంటే శరీరంలోని ఇతర అవయవాలకు సమస్యలు తప్పవు.



కంటికి కూడా డయాబెటిస్ వల్ల సమస్యలు వస్తాయి. కంటి చూపు పోగొట్టే పరిస్థితి రావచ్చు. దీన్నే డయాబెటిక్ రెటినోపతి అంటారు.



డయాబెటిక్ రెటినోపతి అనేది రెటీనాలోని వెనుక ఉన్న నరాలకు వచ్చే వ్యాధి. కంటిలోని రక్తనాళాలను దెబ్బతీస్తుంది.



రక్తనాళాలు సరిగా పనిచేయకపోవడం వల్ల దృష్టి మందగిస్తుంది. సకాలంలో వైద్య చికిత్స తీసుకోకపోతే అంధత్వం వచ్చే అవకాశం ఉంది.



డయాబెటిక్ రెటినోపతి వచ్చిన ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు.



కంటి చూపు కోసం కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తినాలి.



కాలీఫ్లవర్, క్యారెట్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, నట్స్, పచ్చిమిరపకాయలు వంటివి తరచూ తినాలి.