బెండకాయ వల్ల లెక్కలు బాగా రావడమే కాదండోయ్ జుట్టు కూడా పొడవుగా పెరుగుతుంది. జుట్టు రాలే సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది. బెండకాయలో ఫైటో కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టుకి చాలా మేలు చేస్తుంది. చుండ్రు సమస్యని నివారిస్తుంది. బెండకాయ ఉడకబెట్టిన నీటితో జుట్టుకి ప్యాక్ వేసుకోవచ్చు. కర్లింగ్ హెయిర్ సాఫ్ట్ చేసుకునేందుకు ఇది అద్భుతమైన రెమిడీ. జుట్టుకి మంచి కండిషనర్ గా పని చేస్తుంది. క్యుటికల్స్ ని సరి చేస్తుంది. స్కాల్ఫ్ దురద, మంటని తగ్గించే మాయిశ్చరైజర్ గా బెండకాయ బాగా పని చేస్తుంది. జుట్టు పెరుగుదలని ప్రోత్సహిస్తుంది. జుట్టు ఒత్తుగా అయ్యేందుకు సహాయపడుతుంది. బెండకాయ వల్ల మెరిసే అందమైన జుట్టు మీ సొంతం అవుతుంది.