ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022లో న్యూజిలాండ్ మరో అద్భుత విజయం అందుకుంది. సిడ్నీ మైదానంలో బ్యాటు, బంతి, ఫీల్డింగ్‌తో చెలరేగింది. 168 టార్గెట్ ఛేదనకు దిగిన శ్రీలంకను 65 తేడాతో ఓడించింది. ట్రెంట్ బౌల్ట్ (4/13)చెలరేగడంతో లంక 19.2 ఓవర్లకే 102కి ఆలౌటైంది. లంకేయుల్లో దసున్ శనక (35; 32 బంతుల్లో 4x4, 1x6), భానుక రాజపక్స (34; 22 బంతుల్లో 3x4, 2x6) కాసేపు పోరాడారు. కివీస్‌లో గ్లెన్ ఫిలిప్స్ (104; 64 బంతుల్లో 10x4, 4x6) అద్వితీయ సెంచరీ అందుకున్నాడు. ఫిలిప్స్ కు డరైల్ మిచెల్ (22) అతడికి అండగా నిలిచాడు. పాయింట్లు, రన్‌రేట్ పెంచుకొని గ్రూప్ 1లో కివీస్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. శ్రీలంకకు అచ్చిరాలేదు. గ్లెన్ ఫిలిప్స్ క్యాచులు వదిలేశారు. ఈ గెలుపుతో కివీస్ సెమీస్ అవకాశాలు సులువయ్యాయి.