ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌లో మ్యాచ్‌లు వర్షార్పణం అవుతున్నాయి. శుక్రవారం రెండు మ్యాచులు కనీసం బంతి పడకుండానే రద్దయ్యాయి. ఈ రెండు మ్యాచులకీ మెలబోర్నే వేదిక. ఆసీస్ x ఇంగ్లాండ్, అఫ్గాన్ x ఐర్లాండ్ మ్యాచులు రద్దయ్యాయి. జింబాబ్వేపై 5 నిమిషాల్లో సౌథాఫ్రికా గెలుస్తుందనగా వర్షంతో పాయింట్లు పంచుకోవాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ పై ఐర్లాండ్ డక్ వర్త్ లూయిస్ విధానంలో గెలిచింది. న్యూజిలాండ్, ఐర్లాండుతో అఫ్గాన్ 2 మ్యాచులు వర్షంతో రద్దు అయ్యాయి. మరికొన్ని రోజులు ఆసీసులో వర్షాలు కురిసే అవకాశం ఉంది. దాంతో ఇంకా మ్యాచులు రద్దవుతాయని ఆందోళన పడుతున్నారు. కొన్ని వారాలుగా కురుస్తున్న వర్షాలతో ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారుతోంది. ఆటగాళ్లు పరుగెత్తుతూ గాయపడతారని జట్లన్నీ భయపడుతున్నాయి. గ్రూప్ 2తో పోలిస్తే గ్రూప్ 1 మ్యాచులపై వరుణుడి ప్రభావం ఎక్కువగా ఉంది.