విరాట్‌ కోహ్లీ మళ్లీ రికార్డుల వేట మొదలెట్టాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్‌ -10లోకి వచ్చేశాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో 9వ స్థానానికి ఎగబాకాడు.

గతేడాది నవంబర్‌ నుంచి అతడు టాప్‌-10 బయటే ఉన్నాడు.

ఈ ఏడాది ఆరంభంలో టాప్‌-10లోకి వచ్చినా పేలవ ఫామ్‌తో వెనక్కి వెళ్లాడు.

ఆగస్టు 2022లో ఛేదన రారాజు ర్యాంకు 35.

ఆసియాకప్‌, ఆసీస్‌, సఫారీ సిరీసుల్లో విరాట్‌ అదరగొట్టాడు.

టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై కింగ్‌ దుమ్మురేపాడు.

అజేయ హాఫ్‌ సెంచరీతో టీమ్‌ఇండియాను గెలిపించాడు.

సూర్యకుమార్‌ ర్యాంకు 2 నుంచి 3కు తగ్గింది.