ఎన్టీఆర్ 'టెంపర్'లో ఈ అందాల భామ నటించారు. ఇంతకీ, ఈవిడ ఎవరో గుర్తు పట్టారా? 'టెంపర్'లో తన చెల్లెలు దీప్తిని మానభంగం చేసిన వ్యక్తుల వీడియో ఎన్టీఆర్ చేతికి ఇచ్చిన లక్ష్మి పాత్రలో నైరా నటించారు. 'టెంపర్' కంటే ముందు అల్లు శిరీష్ 'కొత్త జంట' సినిమాలో 'అటు అమలాపురం' రీమిక్స్ సాంగ్ చేశారు. 'టెంపర్' తర్వాత 'దోచేయ్' సినిమాలోనూ స్పెషల్ సాంగ్ చేశారు. బ్రహ్మితో సాంగ్, సీన్ చేశారు. నైరా బెనర్జీ కథానాయికగా పరిచయమైనది తెలుగు సినిమాతోనే. నటుడు అజయ్ హీరోగా నటించిన 'ఆ ఒక్కడు' నైరా బెనర్జీ మొదటి సినిమా. అప్పుడు ఆమె పేరు మధురిమా బెనర్జీ. అల్లరి నరేష్ సరసన 'సరదాగా కాసేపు'తో పాటు కొన్ని తెలుగు సినిమాలు చేశారు. 'దోచేయ్', 'బెస్ట్ యాక్టర్స్' తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో హిందీ టీవీ సీరియళ్లు చేస్తున్నారు నైరా. నైరా బెనర్జీ (all images courtesy : manav manglani)