నువ్వులన్నం తింటే ఎంతో బలం


నువ్వులు - 5 టీ స్పూన్లు
వండిన అన్నం - 2 కప్పులు
మినపప్పు - ఒక టీస్పూను
శెనగపప్పు - ఒక టీస్పూను
వేరు శెనగపలుకులు - గుప్పెడు
వెల్లుల్లి - 4 రెబ్బలు



ఎండు మిర్చి - 4
ఆవాలు - అర టీస్పూను
కరివేపాకులు - గుప్పెడు
పసుపు - పావు టీస్పూను
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా



కళాయిలో శెనగపప్పు, మినపప్పు, ఎండు మిర్చి, నువ్వులు వేసి వేయించి, పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.



అదే కళాయిలో నూనె వేసి ఆవాలు, వెల్లుల్లి, కరివేపాకులు, పసుపు, మినపప్పు వేసి వేయించాలి.



ఇందులో వండిన అన్నం. ఉప్పు వేసి కలపాలి.



తరువాత ముందుగా చేసిపెట్టుకున్న నువ్వుల పొడిని కలపాలి.



అంతే టేస్టీ నువ్వుల అన్నం రెడీ.