చలికాలంలో మాత్రమే దొరికే కొన్న పండ్లు చలికాలంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనె బలాన్ని శరీరానికి ఇస్తాయి. సపోటాలో ఉండే పోషకాలు నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. వీటిలో పొటాషియం, సోడియం, కాపర్, ఐరన్, మెగ్నిషియం పుష్కలం. విటమిన్ C పుష్కలంగా ఉండే స్టార్ ఫ్రూట్ తీసుకుంటే నిరోధక వ్యవస్థ బలం సంతరించుకుంటుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. బొప్పాయి తిన్నపుడు శరీరంలో వేడి పుడుతుందని ఆయుర్వేదం చెబుతోంది. కఫ, వాతాలను సంతులనం చేస్తుంది. విటమిన్-C కలిగిన దానిమ్మ ఇమ్యూనిటి పెంచుతుంది. చలికాలంలో సాధరణంగా వచ్చే జలుబు, దగ్గులను నివారిస్తుంది. స్ట్రాబెర్రీలో విటమిన్ C, B9, పోటాషియం ఉంటాయి. రక్తంలో షుగర్ స్థాయిలను అదుపు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రేప్స్ లో పోటాషియం కూడా ఎక్కువ. ఇవి చర్మం, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. విటమిన్ C, మినరల్స్ కలిగిన జామ ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది. పైనాపిల్ ఇమ్మూనిటి పెంచి దగ్గు, జలుబు వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. All Images Credit: Pexels