కొన్ని పదార్థాలు పచ్చిగా తింటే రుచిగా ఉండకపోవచ్చు, కొన్నిజీర్ణం చేసుకోవడం కష్టం, మరికొన్ని పచ్చిగా తినడం ప్రమాదకరం.

ఉడికించని బంగాళదుంపలు జీర్ణవ్యవస్థకు నష్టం చేస్తాయి. వీటిలో ఉండే గ్లైకోఆల్కలాయిడ్స్ అనే టాక్సిన్స్ ఉంటాయి.

చిక్కుళ్లలో లైనమారిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది సైనైడ్ గా మారుతుంది. వీటిని ఉడికించి తినడం సురక్షితం.

ఎర్రని కిడ్నీ బీన్స్‌లోని లెక్టిన్లు తీవ్రమైన గ్యాస్ట్రో ఇంటెస్టయినల్ డిస్ట్రెస్‌కు కారణం అవుతాయి. ఉడికిస్తే లెక్టిన్లు నాశనమవుతాయి.

పుట్టగొడుగులను ఉడికించకుండా తినడం సురక్షితం కాదు. ఉడికించినపుడు పుట్టగొడుగులు రుచిగా ఉంటాయి.

కొడిగుడ్డు పచ్చిగా తినడం వల్ల సాల్మోనెల్లా బ్యాక్టీరియా సంక్రమణ జరగవచ్చు. ఉడికించి తినడం వల్ల దీన్ని నివారించవచ్చు.

బాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్ నుంచి కాపాడేందుకు మాంసాహారాన్ని తప్పకుండా బాగా ఉడికించి మాత్రమే తినాలి.

ఆలు మాదిరిగానే వంకాయలో కూడా సోలనిన్ ఉంటుంది. ఇది గ్లైకోల్కాయిడ్ పాయిజన్. తప్పకుండా వండిన తర్వాత మాత్రమే తినాలి.

బియ్యం ఉడికించకుండా తినడం మంచిది కాదు. బియ్యంలో బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణ సమస్యలు వస్తాయి.

బ్రొకోలి, కాలీఫ్లవర్ ఉడికించి తినడం మంచిది. రుచి కూడా రెట్టింపు అవుతుంది.
All Images Credit: Pexels