ఈ తరం హీరోల్లో డైలాగులు అద్భుతంగా పలికే హీరోల్లో యంగ్ టైగర్ ఒకరు. RRRలో ఆయన చెప్పిన పవర్ ఫుల్, ఎమోషనల్ డైలాగ్స్ ఇవి

తొంగి తొంగి నక్కి నక్కి గాదే... తొక్కుకుంటూ పోవాలే!  ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలే! - ఎన్టీఆర్ 

మా అన్న తెల్లోల బూట్లు నాకే నీలాంటోళ్లకి దొరక్కుండా పెద్దపులి లెక్క తిరుగితండు! కొమురం భీమ్ గురించి అల్లూరితో రాహుల్ రామకృష్ణ

పసిపిల్లలను తోలుకుపోయి పంజరంలో బందిస్తరా? - బ్రిటీషర్లను కొట్టేటప్పుడు ఎన్టీఆర్

కడుపున పుట్టకపోయినా... కడుపులో పెట్టుకుని చూసుకున్నారు! ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? - ఢిల్లీలో ముస్లిం కుటుంబంలో ఎన్టీఆర్ 

నేను మల్లి కోసం వచ్చాను. మీ బావ మట్టి కోసం వచ్చారు! - ఆలియాతో ఎన్టీఆర్

రామయ్య కోసం సీతమ్మ దేవలాడకూడదు! సీతమ్మ తానకు ఆ రామయ్య రావాలా! ఆలియాతో ఎన్టీఆర్

నా ప్రాణం అడ్డుపెట్టైనా సరే... నీ రాముడిని నేను తోలుకివస్తా! - ఎన్టీఆర్ 

ఆకలి బాధ పసిపిల్లలు తెలియకూడదు, అన్నం బాధపడుతుంది - ఎన్టీఆర్ బృందంతో ఆలియా భట్

ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా! గర్వంతో గి మన్నులో కలిసిపోతానే! - ఎన్టీఆర్

మేం సాబ్ మీ పేరేంటి? - ఒలీవియాతో ఎన్టీఆర్ (ఈ సీన్ థియేటర్లలో చూస్తే బావుంటుంది)  

అన్నా... నువ్ మావోడివే! - ఇంటర్వెల్ ఫైట్ ముందు అల్లూరితో కొమురం భీమ్  

కొమురం భీముడో పాటలో డైలాగులు కాదు, ఎన్టీఆర్ నటన అద్భుతమని ప్రేక్షక లోకం ప్రశంసల వర్షం కురిపిస్తోంది. 

ఈ డైలాగులు ఎన్టీఆర్ నోట వింటే బావుంటుంది! మరిన్ని డైలాగుల కోసం RRR  సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.