ఈ వారం థియేటర్లలో, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలేవి? థియేటర్లలో ఏం వస్తున్నాయి? ఓటీటీల్లో ఏం వస్తున్నాయి?

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మార్చి 31న రిషి కపూర్ చివరి సినిమా 'శర్మాజీ నమ్ కీన్' విడుదల కానుంది.

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' ఏప్రిల్ 1న అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విడుదల

థియేటర్లలో తాప్సి పన్ను నటించిన 'మిషన్ ఇంపాజిబుల్' ఏప్రిల్ 1న విడుదల కానుంది.

హిందీ సినిమా 'ఎటాక్' విడుదల కూడా ఏప్రిల్ 1నే. అందులో జాన్ అబ్రహం హీరో. హీరోయిన్లు రకుల్, జాక్వలిన్ కూడా నటించారు. 

ఏప్రిల్ 1న తెలుగు, బంజారా భాషల్లో 'సేవా దాస్', తెలుగులో హాలీవుడ్ సినిమా 'మార్బియస్' విడుదల కానున్నాయి.

శర్వానంద్, రష్మిక జంటగా నటించిన 'ఆడవాళ్ళు మీకు జోహార్లు' మూవీ ఏప్రిల్ 2న సోనీ లివ్ ఓటీటీలో విడుదల

ఏప్రిల్ 1న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో మమ్ముట్టి 'భీష్మ పర్వం' విడుదల

ఉత్తమ అంతర్జాతీయ సినిమాగా ఆస్కార్ అందుకున్న 'డ్రైవ్ మై కార్' సినిమా మోబి ఓటీటీలో ఏప్రిల్ 1న విడుదల

మార్చి 30న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో హాలీవుడ్ వెబ్ సిరీస్ 'మూన్ నైట్' విడుదల

ఇవండీ ఈ వారం థియేటర్, ఓటీటీ రిలీజులు! మరికొన్ని హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి.