కరోనా టీకా భుజానికే ఎందుకు వేస్తారు?

పోలియోకు చుక్కల రూపంలో టీకా వేస్తారు. కొన్ని వ్యాక్సిన్లను పిరుదులకు ఇస్తారు.

మరి ఇప్పుడు కరోనా టీకా కేవలం చేతి భుజానికే ఎందుకు ఇస్తున్నారు?

కోవిడ్ టీకాలో కరోనా వైరస్‌తో పోరాడే యాంటీ బాడీలను పుట్టించే శక్తి ఉంటుంది.

శరీరంలో ఈ యాంటీ బాడీలను చురుగ్గా పనిచేసేలా చేయాలంటే కణజాలం అవసరం. కణజాలం కండరాల్లో పుష్కలంగా దొరుకుతుంది.

కండరాల్లో రక్త నాళాలు, రక్తం ఉంటాయి. అలాగే వ్యాధినిరోధక కణాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.

కండరాల్లోని కణజాలాలకు కరోనా టీకా ఇస్తే బాగా పనిచేస్తుంది.టీకాలోని కణాలతో వ్యాధినిరోధక కణాలు కలిసి పనిచేస్తాయి.

వ్యాధి నిరోధక కణాల్లో ప్రధానమైనవి టీ కణాలు,బీ కణాలు.

వాటికి బలాన్నిచ్చి, చురుగ్గా పనిచేసేలా చేయడమే కరోనా టీకా చేసే పని.

ఈ రెండు కణాలు శరీరం నుంచి వైరస్ ను బయటికి పంపేందుకు యుద్ధం చేస్తాయి. ఆ రెండింటికి బూస్టింగ్ ఇచ్చేది టీకా అన్నమాట.