ఈ మ్యాచ్‌లో రెండు జట్ల బౌలర్లూ కలిసి 45 ఎక్స్‌ట్రాలు వేశారు. ఐపీఎల్‌లో ఒక మ్యాచ్‌లో నమోదైన అత్యధిక ఎక్స్‌ట్రాలు ఇవే.
రాయల్ చాలెంజర్స్ బౌలర్లు 23 ఎక్స్‌ట్రాలు వేయగా... పంజాబ్ బౌలర్లు 22 ఎక్స్‌ట్రాలు వేశారు.
2008లో డెక్కన్ చార్జర్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 38 ఎక్స్‌ట్రాలు నమోదయ్యాయి. 15 సంవత్సరాల నాటి రికార్డు ఇప్పుడు బద్దలయిందన్న మాట.
పంజాబ్‌కు ఐపీఎల్‌లో అత్యధిక ఛేదన ఇదే. ఇంతకుముందు సన్‌రైజర్స్, చెన్నై సూపర్ కింగ్స్‌లపై కూడా 206 పరుగులనే పంజాబ్ ఛేదించింది.
ఐపీఎల్‌లో ఒక్క అర్థ సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోరు చేసింది పంజాబ్ కింగ్సే. ఇంతకుముందు ఈ రికార్డు కోల్‌కతా పేరున ఉండేది. 2019లో బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనే కోల్‌కతా ఈ రికార్డు సాధించింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై అత్యధిక లక్ష్యఛేదన రికార్డు కూడా పంజాబ్‌దే.
ఇంతకు ముందు ఈ రికార్డు చెన్నై (206-రెండు సార్లు), కోల్‌కతా (206)ల పేరు మీద ఉండేది. ఇప్పుడు పంజాబ్ కూడా 206 పరుగులనే ఛేదించింది. (All Images Credits: IPL)