మేషం మేషరాశి వ్యాపారులు ఊహించిన దానికన్నా ఎక్కువ లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అనుకూల సమయం. విద్యార్థులు చదువుపై శ్రద్ధవహించాలి. న్యాయవాదులు ఈరోజు ఒక ముఖ్యమైన కేసులో విజయం సాధిస్తారు. ఆహారం విషయంలో రాజీ పడొద్దు.
వృషభం ఈ రోజు మీరు మీ ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. కొన్ని ముఖ్యమైన పనికి సంబంధించి గందరగోళానికి గురవుతారు. ప్రతికూలతకు దూరంగా ఉండండి. కెరీర్లో విజయం సాధిస్తారు. టెన్షన్ తగ్గుతుంది.
మిథునం వ్యాపారానికి సంబంధించి పెద్ద డీల్ కుదిరే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో జరిగే చర్చలు ఫలవంతమవుతాయి. విద్యార్థులకు రోజు చాలా మంచిది. మీరు ఉద్యోగంలో ఓవర్ టైం పని చేయాల్సి రావచ్చు.
కర్కాటకం కర్కాటక రాశివారు ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉంటారు. మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.ఈ ప్రభావం మీ వ్యక్తిగత జీవితంపై పడుతుంది. వ్యాపారానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మరోసారి ఆలోచించండి.
సింహం మునుపటి పెట్టుబడుల నుంచి భారీ లాభాలు పొందుతారు. మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధం కలిగిఉంటారు. ఉద్యోగంలో మీ పనిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు.రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఉన్నత పదవులు పొందుతారు
కన్య నిర్మాణ పనుల్లో మీ పనితీరు అద్భుతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మీ కష్టాలు తీరుతాయి. మీపై చాలా పని ఒత్తిడి ఉంటుంది. మీరు సామాజిక బాధ్యత గురించి కొంచెం ఒత్తిడికి లోనవుతారు.
తుల జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.ఆర్థిక పరిస్థితి గురించి ఆందోళన చెందుతారు.నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి.వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. భాగస్వామి పట్ల ప్రేమను వ్యక్తం చేయండి.
వృశ్చికం కాలు నొప్పి లేదా తలనొప్పితో బాధపడతారు.మీ పని హడావుడి కారణంగా గందరగోళానికి గురికావచ్చు. మీ జీవనశైలిని క్రమశిక్షణగా ఉంచుకోండి. కొంతమంది మిమ్మల్ని విమర్శించవచ్చు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
ధనుస్సు ఇంటర్వూల్లో విజయం సాధిస్తారు.వాహనం కొనుగోలు చేయవచ్చు.అనవసర వాదనలకు దిగకండి.విమర్శలు ఎదుర్కొంటారు. కష్టపడితేనే సక్సెస్ అవుతారు. మీరంతే అభిమానించేవారి సంఖ్య పెరుగుతుంది.
మకరం ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. పాత మిత్రులను కలుస్తారు.రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు కఠిన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. ఈరోజు బంధువులు వస్తారు. కార్యాలయంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది.
కుంభం మీరు ఈ రోజు శుభవార్త వింటారు. మీ మొండి వైఖరి కారణంగా ఇతర వ్యక్తులు మీపై కోపం తెచ్చుకోవచ్చు.నిలిచిన పనులు మధ్యాహ్నం తర్వాత పూర్తిచేస్తారు. వ్యాపార విస్తరణకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆహారం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి.
మీనం వ్యాపారంలో కొన్ని సమస్యలు ఉండొ. విద్యార్థుల చదువులో కొంత ఆటంకాలు ఏర్పడవచ్చు. అనవసర ఖర్చులను నియంత్రించుకోండి. మీరు కొన్ని పనులను మళ్లీ చేయాల్సి ఉంటుంది.కార్యాలయంలో సహోద్యోగుల నుంచి సహాయం అందుకుంటారు.