నోరా ఫతేహి ఫ్యాషన్ సెన్స్ గురించి బాలీవుడ్‌లో తెలియని వాళ్లు ఉండరు. ఎప్పుడూ కొత్త తరహా అవుట్ ఫిట్‌లను ట్రై చేస్తుంది. తన ఫ్యాషన్ డైరీ ఫొటోలను నోరా ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో షేర్ చేస్తారు. ఫ్యాన్స్ నుంచి కూడా ఈ ఫొటోలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. బాలీవుడ్‌లో ప్రత్యేక గీతాలకు నోరా ఫతేహి ఎంతో ఫేమస్. తెలుగులో కూడా తను ఎన్నో ప్రత్యేక గీతాలు చేసింది. బాహుబలిలో ‘మనోహరి’ పాటతో తను బాగా ఫేమస్ అయింది. హిందీలో భరత్, బాట్లా హౌస్, భుజ్ సినిమాల్లో కీలక పాత్రలు కూడా చేసింది. గతేడాది థ్యాంక్ గాడ్, యాన్ యాక్షన్ హీరో సినిమాల్లో ప్రత్యేక గీతాల్లో కనిపించింది. All Image Credits: Nora Fatehi Instagram