సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసింది.

ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా కన్ఫర్మ్ చేసింది.

దీనికి హోమీ అడజానియా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాకి ‘మర్డర్ ముబారక్’ అని పేరు పెట్టారు.

మర్డర్ ముబారక్ 2024లో విడుదల కానుంది.

సారా ప్రస్తుతం బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఉంది.

తన చేతిలో మొత్తంగా ఐదు సినిమాలు ఉన్నాయి.

వీటిలో ఈ సంవత్సరమే నాలుగు సినిమాలు విడుదల కానున్నాయి.

2021లో వచ్చిన ‘అత్రంగి రే’లో చివరి సారిగా సారా కనిపించింది.

2018లో వచ్చిన ‘కేదార్‌నాథ్’ సినిమాతో సారా అలీ ఖాన్ తెరంగేట్రం చేసింది.

Thanks for Reading. UP NEXT

అదా, ఇడ్లీ సాంబర్ కథ - ఇలా కూడా తింటారా?

View next story