రణ్‌బీర్, శ్రద్ధా కపూర్‌ల ‘తూ జూటీ మై మక్కర్’ థియేటర్లలో విడుదల అయింది.

రొమాంటిక్ కామెడీల స్పెషలిస్ట్ లవ్ రంజన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

కథ విషయానికి వస్తే... మిక్కీ అలియాస్ రోహన్ అరోరా (రణ్‌బీర్ కపూర్) బ్రేకప్ స్పెషలిస్ట్.

ప్రేమికుల్లో ఒకరి దగ్గర డబ్బు తీసుకుని ఎదుటి వ్యక్తి బ్రేకప్ చెప్పేలా చేయడం మిక్కీ పని.

స్నేహితుడి బ్యాచిలర్ పార్టీలో టిన్నీ మల్హోత్రాని (శ్రద్ధా కపూర్) చూడగానే ప్రేమలో పడతాడు.

తను కూడా మిక్కీని ఇష్టపడుతుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే కథ.

యూత్ టార్గెట్‌గా ఈ సినిమాని రూపొందించారు. ప్రథమార్థం పూర్తిగా కామెడీగా సాగుతుంది.

ద్వితీయార్థంలో కాస్త ఎమోషన్ టర్న్ తీసుకుంది. మళ్లీ కామెడీ నోట్‌లోనే సినిమా ముగుస్తుంది.

ఏబీపీ దేశం రేటింగ్: 2.75/5