సెకెండ్ ఇన్నింగ్స్ లో కాజల్ జోరు- వరుస సినిమాలతో ఫుల్ బిజీ క్యూట్ బ్యూటీ కాజల్ అగర్వాల్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తెలుగులో అగ్ర హీరోలతో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ప్రస్తుతం సెకెండ్ ఇన్నింగ్స్ ను పక్కాగా ప్లాన్ చేసుకుంటోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తోంది. పాన్ ఇండియన్ మూవీ ‘ఇండియన్2’లో కమల్ హాసన్ సరసన నటిస్తోంది. బాలయ్య, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న ‘NBK 108’ హీరోయిన్ గా చేస్తోంది. కళ్యాణ్ దర్శకత్వంలో కాజల్ కీలక పాత్రలో తెరకెక్కిన తమిళ మూవీ ‘ఘోస్టీ’ మార్చి 17న రిలీజ్ కానుంది. హిందీలో తథాగతా సింగ్ దర్శకత్వంలో కాజల్ ప్రధాన పాత్రలో ‘ఉమ’ అనే మూవీ తెరకెక్కుతోంది. Photos Credit: Kajal Aggarwal/twitter