కాల్షియం అనగానే పాలు గుర్తొస్తాయి. కానీ కొంత మంది పాలు, పాల పదార్థాలకు అలెర్జిక్ గా ఉంటారు.

పాలు, పాల పదార్థాల అలెర్జిని లాక్టోజ్ ఇన్టాలెరెన్సీ అంటారు. వీరికోసం కాల్షియం కలిగిన పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

కాల్షియంతో పాటు విటమిన్ డి కలిగిన సోయా పాలు పాలకు మంచి ప్రత్యామ్నాయం.

కాల్షియంతో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్ కలిగిన షియా సీడ్స్ మంచి పోషకాహారం.

ఒక కప్పు బాదాముల నుంచి 385 మి.గ్రా. కాల్షియం లభిస్తుంది. రోజుకోక కప్పు తీసుకుంటే కాల్షియం అవసరం తీరుతుంది.

నువ్వుల్లో ఉన్నంత కాల్షియం మనకు బ్రొకొలి నుంచి లభిస్తుంది. రోజుకో కప్పు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

సోయా పాల నుంచి తయారు చేసిన టోఫూలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది.

కాలే తీసుకుంటే తక్కువ క్యాలరీలతో శరీరంలో కాల్షియం అవసరాలు తీరుతాయి.

ఒక కప్పు పొద్దుతిరుగుడు గింజల నుంచి 109 మి.గ్రా. కాల్షియం అందుతుంది. వీటితో నాడీ, కండర వ్యవస్థ ఆరోగ్యం కూడా బాగుంటుంది.

రోజుకు ఒక చెంచా నువ్వులు తిన్నా చాలు 88 మి.గ్రా. కాల్షియం అందుతుంది.

ఒక పెద్ద చిలగడ దుంప నుంచి 68 మి.గ్రా. కాల్షియం శరీరానికి అందుతుంది. దీనిలో విటమిన్ ఎ, సిలు అదనంగా ఉంటాయి.

Images courtesy : Pexels