దాల్చిన చెక్క టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి.

దాల్చిన చెక్కతో చేసి టీ తాగేవారిలో రక్తంలో షుగర్ స్థాయిలు అదుపులో ఉంటాయి. డయాబెటిక్స్ కి చాలా మంచిది.

దాల్చిన చెక్క చాయ్ తాగాతే కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి రక్తనాళాలు, గుండె ఆరోగ్యం బావుంటుంది.

ఈ టీ సహజంగానే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

దాల్చిన చెక్క చాయ్ తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. జీర్ణవ్యవస్థ ఆరోగ్యం బావుంటుంది.

బరువు నియంత్రణలో కూడా దాల్చిన చెక్క మంచి పాత్ర పోషిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయట.

కాగ్నిటివ్ ఫంక్షన్స్ మీద వయసు ప్రభావాన్ని కూడా తగ్గిస్తుంది.

నెలసరిలో సమయంలో వచ్చే కడుపునొప్పి, ఇతర అసౌకర్యాలను కూడా తగ్గిస్తుంది.

ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు

Images courtesy : Pexels