మచ్చలేని నున్నని గాజువంటి చర్మం కావాలంటే దానికి స్కిన్ కేర్ తో పాటు ఆరోగ్యవంతమైన జీవన విధానం అవసరం. ముఖం మీద అదనంగా కనిపించే జిడ్డుతో పాటు, సన్ స్క్రీన్, మేకప్ కూడా తొలగించేందకు ఆయిల్ బేస్డ్ క్లెన్సర్ వాడాలి. దాని తర్వాత పూర్తిగా శుభ్రం చేసేందుకు వాటర్ బేస్డ్ క్లెన్సర్ వాడాలి. చర్మం డీహైడ్రేట్ కాకుండా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా మృతకణాలు తొలగించే ఎక్స్ ఫోలియేషన్ చెయ్యాలి. ఇందుకు మైల్డ్ కెమికల్ ఎక్స్ ఫోలియేంట్స్ వాడాలి. చర్మాన్ని హైడ్రేట్ చేసే సీరమ్, నాన్ కమొడోజెనిక్ మాయిశ్చరైజర్లు వాడాలి. గ్లిజరిన్, హెల్యూరొనిక్ ఆసిడ్ ఉన్న ఉత్పత్తులు వాడడం మంచిది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడేందుకు కనీసం ఎప్పీఎప్ 30 ఉన్న సన్ ప్రొటెక్షన్ వాడాలి. ప్రిమెచ్యూర్ ఏజింగ్ నుంచి కాపాడుతుంది. విటమిన్ సి,ఇ వంటి యాంటీఆక్సిడెంట్ సీరమ్స్ ఉపయోగిచాలి. చర్మం రంగును కాపాడుతాయి. చర్మసౌందర్యానికి తప్పని సరిగా తగినంత నిద్ర అవసరం. తప్పకుండా 7,8 గంటలు నిద్రపోవాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. పండ్లు, కూరగాయల్లో ఉండే పోషకాలు చర్మ సౌందర్యానికి అవసరం. ఒత్తిడి లేని జీవితం కోసం యోగా, మెడిటేషన్, శ్వాస వ్యాయామాలు చెయ్యాలి. ఒత్తిడి ప్రభావం చర్మ సౌందర్యం మీద నేరుగా ఉంటుంది. Images courtesy : Pexels