కొన్ని రకాల పదార్థాలు ఉడికించి మాత్రమే తినాలి అలాంటి వాటిలో బియ్యం కూడా ఒకటి.

ఎందుకు బియ్యం ఉడికించి మాత్రమే తినాలో తెలుసుకుందాం.

అన్నం వండిన కొద్ది సమయంలో తినెయ్యాలి. లేదా ఫ్రిజ్ లో ఉంచాలి. లేదంటే బాసిల్లస్ సెరియస్ వృద్ది చెందవచ్చు.

వరి పంటలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా స్పోర్స్ బియ్యంలో మిగిలి ఉండొచ్చు.

ఆ బ్యాక్టీరియా వల్ల ఫూడ్ పాయిజనింగ్ సమస్య రావచ్చు. ఫలితంగా కడుపునొప్పి, వికారం, వాంతులు కలుగవచ్చు.

ఈ బ్యాక్టీరియాను తొలగించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

బియ్యం తప్పక ఉడికించి మాత్రమే తినాలి. వండిన వెంటనే వడ్డించాలి.

వండిన గంటలోపునే ఫ్రిజ్ లో భద్రపరచాలి. ఒకరోజు లో మరోసారి వేడి చేసి తినొచ్చు.

అన్నాన్ని వేడి చేసినపుడు అన్నం మొత్తం వేడిగా ఉండాలి. ఒక్కసారి కంటే ఎక్కువ సార్లు వేడి చేసి ఉపయోగించవద్దు.

ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు

Images courtesy : Pexels