క్యాబేజి మంచి పోషకాలు కలిగిన కూరగాయ. తప్పని సరిగా క్యాబెజి ఎందుకు తీసుకోవాలో తెలుసుకుందాం.

ఇందులో నిరోధక శక్తి పెంచడం నుంచి మెదడు ఆరోగ్యం వరకు అవసరమయ్యే పోషకాలుంటాయి.

బ్రకోలీ, కాలీఫ్లవర్ మాదిరిగా క్యాబేజి కూడా క్యూసిపెరా కాయగూర. వీటిలో ఉండే సమ్మేళనాలు క్యాన్సర్ ను నివారిస్తాయి.

వీటిలో ఆంథోసయానిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ ను నిరోధిస్తాయి.

క్యాబేజిలో సెల్ఫోరాఫేన్, కెంపెరోల్ సమ్మేళనాల వల్ల యాంటీఇన్ప్లమేటరీ లక్షణాలు ఉంటాయి.

క్యాబేజిలో విటమిన్ కె, అయోడిన్ తోపాటు ఆంథోసయనిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.

ఈ యాంటీఆక్సిడెంట్లు మతిమరుపు పెంచే టౌప్రొటీన్ల స్థాయిలను తగ్గిస్తాయి. మెదడు పనితీరు చురుకుగా ఉంచుతాయి.

క్యాబేజిలో పొటాషియం ఎక్కువ కనుక బీపి అదుపులో ఉంచుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

Images courtesy : Pexels