ఆరోగ్యం మీద చెడు ప్రభావం చూపుతాయని కొంత మంది ప్రిజర్వేటివ్స్, ఫ్లేవర్స్, రంగులు కలిపిన ఆహారం తీసుకోరు. సోడాలు, అదనపు చక్కెరలు కలిగిన డ్రింక్స్, పండ్లరసాలు తీసుకోవద్దు. వీటితో బరువు పెరిగే ప్రమాదం ఉంది. ట్రాన్స్ ఫ్యాట్స్, హైడ్రోజినేటెడ్ ఆయిల్స్ ఉన్న పదార్థాలు తీసుకున్నపుడు గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. చిప్స్, కుకీస్ వంటి స్నాక్స్ చాలా ఎక్కువ ప్రాసెస్ చేసి తయారు చేస్తారు. వీటిలో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. చాలా రకాల ఫాస్ట్ ఫూడ్స్ లో సోడియం, కొవ్వు, క్యాలరీలు ఎక్కువ గా ఉంటాయి. ఇవి తరచుగా తీసుకుంటే సమస్యలకు కారణమవుతాయి. అదనంగా చక్కెరలు చేర్చిన బ్రేక్ ఫాస్ట్ సీరియల్స్ వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి నూనెలో వేయించిన స్నాక్స్ వల్ల బరువు పెరగడం, గుండె సమస్యలకు కారణం అవుతాయి. రిఫైన్డ్ పిండి ఉపయోగించి చేసే బ్రెడ్స్ వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. హోల్ గ్రెయిన్ బ్రెడ్స్ ఎంచుకోవడం మంచిది. బాగా ప్రాసెస్ చేసిన సాసేజులు, హాట్ డాగ్స్ వంటి మాంసాహారాల్లో సోడియం ఎక్కువ. ఇది ఆరోగ్యానికి చెరుపు చేస్తుంది. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ సమాచారం చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు Images courtesy : Pexels