వరదలో కొట్టుకుపోతున్న చేపలు, ఎగబడ్డ జనం బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో గత వారం రోజులుగా వర్షాలు వర్షాలతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని కరత్వాడ ప్రాజక్టు నిండిపోయింది. ఎగువ నుంచి నీరు రావడంతో ప్రాజెక్టు అలుగుపై నుంచి వరద పారుతోంది వరద నీటితో పాటు ప్రాజెక్టులోని చేపలు అలుగుదాటి కొట్టుకు పోతున్నాయి చేపల కోసం కరత్వాడ గ్రామస్థులు వలలతో అక్కడికి చేరుకుంటున్నారు బోథ్ తో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి చేపలు పట్టుకెళ్లారు కొంత మంది జాలర్లు చేపలు పట్టి, అక్కడే తక్కువ ధరలకు విక్రయించారు చేపల కోసం జనాలు ఎగబడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి భారీ వర్షాలు, వరదలతో పలు ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి