తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.

మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ నుండి హెలికాఫ్టర్ లో జైనథ్ చేరుకున్నారు

అక్కడి నుంచి రోడ్ మార్గం ద్వారా దీపాయిగూడకు చేరుకున్నారు

ఎమ్మెల్యే జోగు రామన్న ఇంటికి వెళ్ళి అయన తల్లి జోగు బోజమ్మ చిత్రపటానికి మంత్రులు నివాళులర్పించారు

ఎమ్మెల్యే జోగు రామన్న, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు.

కేటీఆర్ వెంట ఎమ్మెల్సీ లు దండే విఠల్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కు, తదితరులు ఉన్నారు.

తెలంగాణ మాజీ మంత్రి, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్నకు ఇటీవల మాతృవియోగం కలిగింది.

టీఆర్ఎస్ నేత జోగు రామన్న తల్లి భోజమ్మ(98) గత సోమవారం కన్నుమూశారు.

జోగురామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ మరణం పట్ల సీఎం సంతాపం వ్యక్తం చేశారు.

నేడు మంత్రులు ఆదిలాబాద్ వెళ్లిన జోగు రామన్నను పరామర్శించారు