చాలామంది రెగ్యులర్​గా బ్రెడ్ తింటారు. ముఖ్యంగా వైట్ బ్రెడ్​ని ఎక్కువమంది తింటూ ఉంటారు.

కానీ వైట్ బ్రెడ్​ ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్తున్నారు.

వైట్ బ్రెడ్​లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇవి కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను పెంచుతుంది.

ఫైబర్ తక్కువగా ఉండడం వల్ల మలబద్ధకం పెరుగుతుంది. మరికొందరిలో డయోరియా సమస్యలను పెంచుతుంది.

దీనిలోని గ్లైసమిక్ ఇండెక్స్ రక్తంలోని షుగర్ లెవెల్స్​ను పెంచుతుంది. షుగర్ ఉన్నవాళ్లు తినకపోవడమే మంచిది.

వైట్ బ్రెడ్​లో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువును పెంచుతాయి. ఒబెసిటీని పెంచుతుందట.

మెటబాలీజంను తగ్గిస్తుంది. ఇది తక్కువైతే బరువు తగ్గడం చాలా కష్టతరం చేస్తుంది.

గుండె సమస్యలను, స్ట్రోక్ సమస్యలను పెంచే గుణాలు వైట్ బ్రెడ్​లో ఉన్నాయని చెప్తున్నారు.

పోషకాలు తక్కువగా ఉండడంతో పాటు.. అలెర్జీ సమస్యలను పెంచే లక్షణాలు దీనిలో ఉన్నాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహా తీసుకుని డైట్​ని బ్యాలెన్స్ చేసుకుంటే మంచిది.