పేపర్‌లో టేస్టీ టీ చేయడం ఎప్పుడైనా చూశారా సాధారణంగా ఏదైనా పాత్రలో చాయ్ చేస్తుంటాం. ఆదిలాబాద్ జిల్లాలో ఓ చాయ్‌వాలా వెరీ స్పెషల్ పేపర్‌లో టేస్టీ టీ తయారుచేసి అందరికీ షాకిస్తున్నాడు అన్నూ భాయ్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా చాంద(టీ) గ్రామం పేపర్‌లో టీ పొడి, పాలు పోసి మరిగించి రుచికరమైన చాయ్ చేసి రుచి చూపిస్తాడు అన్నూ భాయ్ టాలెంట్ గుర్తించి గతంలో కలెక్టర్ ప్రశంసా పత్రం అందించారు ప్రభుత్వం ఏదైనా ఉపాధి చూపించాలని, లేకపోతే లోన్ ఇవ్వాలని ఆయన కోరారు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చి తమను ఆదుకోవాలని అన్నూభాయ్ దంపతులు కోరారు వెరైటీ చాయ్‌వాలాను ఆదుకోవాలని స్థానికులు సైతం ప్రభుత్వాన్ని కోరుతున్నారు