మీ ఫోన్ హ్యాక్ అయితే కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తాయి.
సమయానికి దానిని గుర్తించినట్లయితే నష్టాన్ని నివారించవచ్చు.
బ్యాటరీ సాధారణం కంటే చాలా వేగంగా ఖాళీ అవుతుంది. లేదా ఫోన్ ఎక్కువగా వేడెక్కుతుంది. దాని ఆర్థం బ్యాక్‌గ్రౌండ్‌లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉండవచ్చు.
మీకు తెలియకుండా మొబైల్ డేటా వినియోగం అకస్మాత్తుగా పెరిగితే జాగ్రత్తగా ఉండాలి.
ఫోన్ అకస్మాత్తుగా చాలా నెమ్మదిగా పనిచేయడం ప్రారంభించినట్లయితే తరచుగా హ్యాంగ్ అవుతుంటే లేదా యాప్ లు వాటంతట అవే క్లోజ్ అయితే అది హ్యాకింగ్ కావచ్చు.
ఫోన్లో తెలియని యాప్లు కనిపించినా లేదా మీరు ఇన్స్టాల్ చేయని యాప్లు దొరికినా అది మాల్వేర్ సంకేతం కావచ్చు.
అపరిచిత సందేశాలు లేదా కాల్స్ రావడం లేదా వెళ్ళడం ప్రారంభమవుతాయి.
తరచుగా పాప్అప్ ప్రకటనలు రావడం లేదా స్క్రీన్పై తెలియని కార్యాచరణ జరగడం కూడా ఫోన్ హ్యాక్ అయినట్లు సంకేతం కావచ్చు.