మొబైల్ హ్యాంగ్ అవుతుందా? అయితే RAM ఇలా ఖాళీ చేయండి

ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలంటే.. సమయానుసారంగా RAM ను ఖాళీ చేయాలి.

ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చూసేద్దాం.

అవసరం లేని యాప్స్ మూసివేయండి. లేదా అన్ఇన్‌స్టాల్ చేయండి. తద్వారా RAM పై భారం తగ్గుతుంది.

బ్యాక్‌గ్రౌండ్‌లో నిరంతరం నడుస్తున్న యాప్‌లను మూసివేయడం ద్వారా ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది.

యాప్స్ కాష్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం వల్ల RAM, స్టోరేజ్ రెండింటిపై ఉన్న అనవసరమైన భారం తగ్గుతుంది.

ఫోన్ సమయానుసారంగా రీస్టార్ట్ చేయడం వల్ల RAM రిఫ్రెష్ అవుతుంది. పనితీరు మెరుగుపడుతుంది.

ఆపరేటింగ్ సిస్టమ్, యాప్స్ ఎల్లప్పుడూ కొత్త వెర్షన్ కు అప్డేట్ చేయండి. తద్వారా పనితీరు సంబంధిత సమస్యలు తగ్గుతాయి.

మీరు చాలా కాలంగా ఉపయోగించని అప్లికేషన్లను అన్ఇన్స్టాల్ చేసేయండి.

ఈ టిప్స్ ఫాలో అయితే ఫోన్ హ్యాంగ్ అవ్వడం తగ్గే అవకాశం ఉంది.