నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా అంకం మౌనిక (బీజేపీ) ఎన్నికయ్యారు.

Published by: Shankar Dukanam
Image Source: https://telugu.abplive.com/

ఖానాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని మహమ్మద్ సోయబ్ హుస్సేన్ (బీఆర్ఎస్) దక్కించుకున్నారు.

Image Source: https://telugu.abplive.com/

కౌన్సిలర్లు తమ చేతులు ఎత్తి మద్దతు తెలపడం ద్వారా ఈ ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు

Image Source: https://telugu.abplive.com/

ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఎక్స్ అఫిషియో సభ్యునిగా హాజరై తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Image Source: https://telugu.abplive.com/

ఎన్నిక అనంతరం నూతన చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌లు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేశారు.

Image Source: https://telugu.abplive.com/

ఎన్నికల అధికారులు ఖానాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్లకు ధ్రువీకరణ పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Image Source: https://telugu.abplive.com/

ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ ఎన్నిక శనివారం నుంచి ఆదివారం వాయిదా పడగా చివరికి ప్రశాంతంగా ముగిసింది.

Image Source: https://telugu.abplive.com/

మున్సిపల్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీ ఉపేంద్రరెడ్డిలు భారీ బందోబస్తును పర్యవేక్షించారు.

Image Source: https://telugu.abplive.com/

ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Image Source: https://telugu.abplive.com/

Image Source: https://telugu.abplive.com/