నిత్యా మీనన్ సింప్లిసిటీ, పల్లెల్లో సాధారణ వ్యక్తిలా షికారు - చూస్తే ఆశ్చర్యపోతారు నిత్యా మీనన్ అనగానే.. కల్మషం లేని ఆమె చిరునవ్వే గుర్తొస్తుంది. ఆమెలాగానే.. ఆమె మనసు కూడా చాలా అందమైనదని సన్నిహితులు అంటారు. నిత్యా మీనన్‌కు చిన్న పిల్లలా ఎప్పుడూ సరదాగా ఉండటమంటే ఇష్టమట. బరువు పెరిగిపోతున్నా అనే భయం నిత్యాకు అస్సలు ఉండదట. అందుకే నిత్య ఎప్పుడూ తనకు ఇష్టమైన స్వీట్లు లాగిస్తూనే ఉంటుంది. ఆమె ఎలా ఉన్నా, అవకాశాలు వరిస్తున్నాయంటే కారణం.. ఆమె ప్రతిభ. నిత్య నటించిన 19(1)(a) మూవీ ‘డిస్నీ హాట్ స్టార్’లో ఇటీవలే స్ట్రీమింగ్ మొదలైంది. ఈ షూటింగ్ సమయంలో నిత్య.. పలెల్లో సాధారణ వ్యక్తిలా షికారు చేసింది. ఈ వీడియోను నిత్యా ఇటీవలే తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. నిత్యా మీనన్ పోస్ట్ చేసిన వీడియో ఇదే. Images & Videos: Nitya Menen/Instagram