మీరా జాస్మిన్ అంటే.. మీకు తప్పకుండా హోమ్లీ క్యారెక్టర్స్ గుర్తుకొస్తాయి. 21 ఏళ్ల కిందట ‘రన్’ సినిమాతో వచ్చి ‘మోక్ష’తో కనుమరుగైది మీరా జాస్మిన్. ‘గుడుంబ శంకర్’, ‘పందెం కోడి’, ‘గోరింటాకు’, ‘భద్ర’ సినిమాలు మంచి పేరు తెచ్చాయి. అప్పట్లో బొద్దుగా ఉన్న మీరా జాస్మిన్ హోమ్లీ పాత్రలకే పరిమితమైంది. ‘ఆకాశరామన్న’ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ‘మోక్ష’లో చేసినా సక్సెస్ దక్కలేదు. అయితే, కన్నడ, తమిళ చిత్రాల్లో మాత్రం మీరా జాస్మిన్ అవకాశాలు అందుకుంది. 2018లో ‘పూమారం’ అనే మలయాళ చిత్రంతో మీరా జాస్మిన్ మళ్లీ సినిమాల్లో నటించలేదు. నాలుగేళ్ల గ్యాప్ తర్వాత మీరా జాస్మిన్ మళ్లీ సినిమాల్లోకి వచ్చింది. ‘మకల్’ చిత్రంలో నటించింది. అంతేకాదు, సెకండ్ ఇన్నింగ్స్‌లో సోషల్ మీడియా వేదికగా అందాలు ఆరబోస్తోంది మీరా. దీంతో అభిమానులు.. మీరా? మీరు అప్పటి మీరా జాస్మినేనా అని అడుగుతున్నారు. Image Credit: Meera Jasmine/Instagram