రాజధానిలో 'స్పై ప్రమోషన్స్ - బిజీ బిజీగా నిఖిల్, ఐశ్వర్య మీనన్ ! నిఖిల్ ఇప్పుడు 'స్పై' ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. ఎడిటర్ గ్యారీ బి.హెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిఖిల్ సరసన ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. జూన్ 29న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ లో నిఖిల్, ఐశ్వర్య మీనన్ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజాగా ప్రమోషన్స్ కోసం నిఖిల్, ఐశ్వర్య మీనన్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ ప్రమోషన్స్ కి వెళ్తున్న క్రమంలో నిఖిల్ ఓ వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. image Credit : Nikhil Siddhartha/Instagram