ఎన్నికల ఫలితాలను అంచనా వేసేందుకు కొన్ని మీడియా లేక ఇతర సంస్థలు ఎగ్జిట్ పోల్స్‌ విడుదల చేస్తాయి.

ఓటింగ్ ప్రక్రియ ముగిసిన 30 నిమిషాల తర్వాత ఎగ్జిట్ పోల్స్‌ని రిలీజ్ చేస్తారు.

వివిధ ఏజెన్సీలు శాంపిల్ మెథడ్స్, స్టాటిస్టికల్ ఎనాలసిస్‌లను కలిపి.. ఎగ్జిట్ పోల్స్‌ని లెక్కిస్తారు.

ముందుగా ఈ ఏజెన్సీలు ఏరియాల వారీగా ఓటర్ల సమూహాన్ని ఎంపిక చేసుకుంటాయి.

ఒక్కో ఓటర్‌ని ఎవరికి ఓటు వేశారు? ఎక్కడ నివసిస్తారు? వంటి ప్రాథమిక ప్రశ్నలు అడుగుతారు.

వారిచ్చే సమాధానాలను రికార్డ్ చేసుకుంటారు.

నిపుణులు ఈ డేటాని పరిశీలించి, ఎన్నికల ఫలితాల గురించి అంచనా వేసేందుకు విశ్లేషిస్తారు.

ఫైనల్‌గా ఈ అంచనాలను ఎగ్జిట్ పోల్స్ అంటూ ప్రజల ముందు ఉంచుతారు.

ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితత్వం గతంలో ఆయా ఎన్నికల్లో ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్‌పై ఆధారపడి ఉంటుంది.