2025 సంవత్సరానికి కేంద్రం పద్మ అవార్డులు ప్రకటించింది.



దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 139 మందికి పద్మ అవార్డులు వరించాయి.



ఏడుగురికి విభూషణ్ లభిస్తే, 113 మందికి పద్మశ్రీ, 19 మందికి పద్మభూషణ్ లభించింది.



2025లో తెలుగు వారికి ఏడు పద్మ అవార్డులు దక్కాయి.



తెలంగాణకు రెండు పద్మ అవార్డులు వస్తే ఏపీకి ఐదుగురికి వచ్చింది.



తెలంగాణ నుంచి మందకృష్ణకు పద్మశ్రీ, దువ్వూరి నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషన్ లభించాయి.



ఆంధ్రప్రదేశ్‌లో కేఎల్ కృష్ణ, మాడుగుల నాగఫణి శర్మ, మిరియాల అప్పారావుకు పద్మశ్రీ, రాఘవేంద్రచార్యకు పద్మశ్రీ వరించింది.



ఆంధ్రప్రదేశ్‌లో సినీ రంగం నుంచి నందమూరి బాలకృష్ణకు పద్మవిభూషణ్ దక్కింది.