సోమవారం వైభవంగా ప్రారంభమైన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా 12 ఏళ్లకు ఒక సారి వచ్చే మహా కుంభమేళాకు మొదటి రోజే పోటెత్తిన భక్తులు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చే అతిపెద్ద మతపర కార్యక్రమం మహా కుంభమేళా. గంగా, యుమున, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో భక్తుల పవిత్ర స్నానాలు. తొలిరోజు ముహూర్త సమయంలో నాగ సాధువుల స్నానంతో ప్రారంభమైన కుంభమేళా సామాన్యులతో పాటూ సెలబ్రిటీలు పలువురు నేతలు కూడా కుంభమేళాలో తప్పక స్నానామాచారిస్తారు. భారతదేశపు తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 1951లో మహాకుంభమేళాను సందర్శించి గంగా స్నానం చేశారు. 1966 లో జరిగిన కుంభమేళాలో ఇందిరా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి అస్థికలను గంగలో నిమజ్జనం చేసి స్నానం చేశారు 2001లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా కుంభమేళాలో పాల్గొన్నారు మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయి కూడా మహాకుంభంలో స్నానం చేశారు 2019లో ప్రధాని నరేంద్ర మోడీ కూడా కుంభమేళాలో స్నానం ఆచరించారు.