సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుందేం?

నదుల్లో నీరే కదా కలుస్తుంది!

Published by: RAMA

'ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం'

ఆకాశం నుంచి భూమిపై పడే ప్రతి నీటి చుక్కా సముద్రానికే చేరుతుందని దీని అర్థం

సముద్రంలో నీరెందుకు తాగలేం?

వర్షపు నీరు తియ్యగానే ఉంటుంది..నదుల్లో నీరు తాగేందుకు వీలుగా ఉంటుంది..

ఎందుకలా?

నదుల్లో నీరే సముద్రంలో కలుస్తుంది.. వర్షపు నీరు సముద్రంలో పడుతుంది..మరి ఆనీరు మాత్రం ఎందుకు ఉప్పగా ఉంటుంది?

ద్రవరూపం నుంచి వాయురూపంలోకి

సముద్రంలో నీరు సూర్యకాంతిలో వేడిని గ్రహించి ద్రవరూపం నుంచి వాయురూపంలోకి మారుతుంది..అదే వానగా కురుస్తుంది

నదుల నుంచే లవణాలు

నదుల్లో నీటితో పాటూ ఆ నేలలో, తీర ప్రాంతాల్లో, గాలిలో ఉన్న వివిధ రకాలైన పదార్థాలు నీటిలో కలుస్తాయి..ఇందులోనే లవణాలు ఉంటాయి

ప్రవాహం ప్రభావం

నదుల్లో ఉండే నీటిలో గాఢత తక్కువగా ఉండడం వల్ల..ప్రవాహం ఉండండ వల్ల నదీజలం ఉప్పగా అనిపించదు

సముద్రంలో లవణాలు స్థిరంగా ఉండిపోతాయ్

నదుల నీరు సముద్రంలో కలిసేటప్పుడు వాటిలో లవణాలు కూడా సముద్రంలోకి కలుస్తాయి...అవెక్కడీ పోయే అవకాశం ఉండదు

నీటిలో లవణాల గాఢత

కాలక్రమేణా ఆ లవణాల గాఢత మరింత పెరుగుతుంది.. అందుకే సముద్రంలో నీరు ఉప్పగా ఉంటుంది

నదుల నుంచి వచ్చిన ఉప్పే..

మైదాన ప్రాంతాల్లో ఉండే లవణాలను నదులు కొంచెం కొంచెంగా సముద్రంలో కలిపేశాయని చెబుతారు పరిశోధకులు