భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం ద్వీపాన్ని భారత ప్రధాన భూభాగంతో కలిపే ఒక చారిత్రాత్మ వంతెన పంబన్ బ్రిడ్జి



పంబన్ బ్రిడ్జి భారతదేశంలో సముద్రం మీద నిర్మించిన మొట్టమొదటి వంతెన. దీన్ని 1914లో నిర్మించారు.



పంబన్ బ్రిడ్జి డబుల్-లీఫ్ బాస్క్యూల్ (Double-Leaf Bascule) డిజైన్ ప్రత్యేకం. ఈ భాగం ఓడలు దాటడానికి వీలుగా వంతెన మధ్య భాగాన్ని పైకి ఎత్తగలుగుతుంది.



దాదాపు 100 సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ వంతెన ఇంజనీరింగ్ అద్భు



ఇది రామేశ్వరం ద్వీపాన్ని మండపం తో కలుపుతుంది. ఈ ప్రాంతం సముద్రం అందమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది.



పాత పంబన్ రైలు వంతెనతో పాటు, 1988లో రోడ్డు రవాణా కోసం ఒక కొత్త వంతెన కూడా నిర్మించారు.



సముద్ర తుఫానులు, ఉప్పునీటి తుప్పు వంటి సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ చెక్కు చెదరలేదు. 1964లో ఒక తుఫానులో ఈ వంతెన దెబ్బతిన్నప్పటికీ పునరుద్ధరించారు.



భద్రతా సమస్యల దృష్ట్యా పాత పంబన్ వంతెనను 2022 డిసెంబర్ 23న మూసివేశారు.



కొత్త పంబన్ వంతెన నిర్మాణం పూర్తయింది. రామనవమి రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీనిని అధికారికంగా ప్రారంభించనున్నారు.



మరో ఇంజనీరింగ్ అద్భుతంగా నిలవనున్న కొత్త పంబన్ బ్రిడ్జి