ఆ 6 పెట్టెల్లో ఏమున్నాయో తెలుసా!
తమిళనాడు దివంగత CM జయలలితకు ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు కోర్టు అధికారులు
జయలలిత ఆస్తులు, పత్రాలను బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో భద్రపరిచారు
జయలలిత అక్రమాస్తుల కేసు తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు జప్తు చేసిన ఆస్తులు ఇవి
27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 10 వేల చీరలు, 750 జతల పాదరక్షలు ఉన్నాయి
1,672 ఎకరాల వ్యవసాయ భూములకు సంబంధించిన పత్రాలు, ఇంటి దస్తావేజులు ఉన్నాయి
ఆస్తుల్లో 8,376 పుస్తకాలు కూడా ఉన్నాయి..వీటన్నింటినీ 6 ట్రంక్ పెట్టెల్లో తీసుకొచ్చారు అధికారులు
న్యాయమూర్తి హెచ్‌ఎన్ మోహన్ సమక్షంలో జయ లలిత ఆస్తులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించారు.
జయలలితకు వారసులం అంటూ జె.దీపక్, జె.దీప అనే వ్యక్తులు వేసిన అర్జీని కర్ణాటక హైకోర్ట్ ఇదివరకే కొట్టేసింది